వైద్యవిద్య మా భవిష్యత్తు
మెరిట్‌కు ప్రాధాన్యత – మనీకి కాదు! ప్రతిభ ఉన్న విద్యార్థికి సీటు రావాలి కానీ, డబ్బు ఉన్నవాడికి కాదు. వైద్య విద్య ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
పేదవాడి డాక్టర్ కల ఏమవ్వాలి?
ఫీజులు పెంచి, సీట్లు అమ్ముకుంటే.. పేదవాడు డాక్టర్ ఎలా అవుతాడు? వైద్య విద్యను కార్పొరేట్ శక్తుల పరం చేయడాన్ని యువతరం తీవ్రంగా ఖండిస్తోంది!
పీపీపీ విధానం విరమించాలి
వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉంచితే పేద, మధ్యతరగతి, గిరిజన విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా వైద్య విద్యను అభ్యసించవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుంది. టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని పూర్తిగా విరమించాల్సిన అవసరం ఉంది.
– కె. శేషాద్రినాయుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్
బైపీసీ, గురుకుల కళాశాల, జి.మాడుగుల
ప్రైవేటీకరణ తగదు
రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల డబ్బుతో నిర్మిస్తే వాటిని టీడీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఏమాత్రం తగదు. ప్రభుత్వం పునరాలోచించి వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలి. పేదలకు మెరుగైన వైద్యంతోపాటు పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలి.
– కిల్లో కృష్ణ్ణ, బీఎస్సీ, బీఈడీ, బౌంసుగుడ,
బస్కీ పంచాయతీ, అరకులోయ మండలం
పేదలకు తీవ్ర నష్టం
పేదలకు మెరుగైన వైద్యం అందించకుండా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. గిరిజన విద్యార్థులకు కూడ వైద్య విధ్య అందాలంటే కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహిచాల్సిన అవసరం ఉంది.
– కిల్లో రఘునాథ్, బీఏ బీఈడీ, బొండాగుడ,
బస్కీ పంచాయతీ, అరకులోయ
భరించలేనంతగా ఫీజులు
ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ఆదివాసీ, పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరమవుతుంది. ఫీజు లు భరించలేనంతగా పెరుగుతాయి. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం, విద్య అందుబాటులో లేకుండా పోతుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుంది. ప్రైవేటీకరణ వద్దు.
– కె అశోక్, ఇంటర్ సెకండియర్ బైపీసీ,
గురుకులం కళాశాల, జి.మాడుగుల
అందరికీ వైద్యవిద్యకు అవకాశం
ఇంటర్ బైపీసీ చదివా. నీట్ పరీక్ష రాసినప్పటికీ ర్యాంక్ ఎక్కువగా రావడంతో మెడికల్ సీట్ రాలేదు. తరువాత బీఎస్సీ పూర్తి చేశా. అప్పట్లో వైద్య కళాశాలలు తక్కువగా ఉన్నందున ఎంబీబీఎస్ చదవలేకపోయా. పాడేరులో వైద్య కళాశాల గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం లభించింది. – బురిడి రాము, బీఎస్సీ, బీఈడీ, బయలుగుడ
ఆశయానికి అడ్డుకట్ట వద్దు వైద్యం అనేది సేవ, వ్యాపారం కాదు. ప్రైవేటీకరణ పేరుతో సామాన్యుడి డాక్టర్ కలని చిదిమేయకండి. విద్య అందరికీ సమానంగా అందాలి!
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసన రాజుకుంటోంది. పీపీపీ పద్ధతి వల్ల ఫీజులు పెరిగి, పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అధిక సంఖ్యలో మద్దతు ఇచ్చి తమ నిరసన తెలిపారు. వారి మాటల్లోనే .. – సాక్షి, పాడేరు
వైద్యవిద్య మా భవిష్యత్తు
వైద్యవిద్య మా భవిష్యత్తు
వైద్యవిద్య మా భవిష్యత్తు
వైద్యవిద్య మా భవిష్యత్తు
వైద్యవిద్య మా భవిష్యత్తు
వైద్యవిద్య మా భవిష్యత్తు


