జగన్‌ను కలిసిన జిల్లా నేతలు
సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కలిశారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను వివరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటిసంతకాల సేకరణ విజయవంతంగా నిర్వహించడంపై అధినేత నుంచి ఆయన అభినందనలు అందుకున్నారు. జిల్లాలో మరిన్ని ప్రజా ఉద్యమాలను విస్తృతం చేయాలని పార్టీ అఽధినేత పిలుపునిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అరకు ఎంపీ తనూజరాణి, రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి,ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
జగన్‌ను కలిసిన జిల్లా నేతలు
జగన్‌ను కలిసిన జిల్లా నేతలు
జగన్‌ను కలిసిన జిల్లా నేతలు


