విద్యుత్ ఆదా ప్రతి ఒక్కరి బాధ్యత
● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్
చింతూరు: ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయడం బాధ్యతగా భావించాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని బుధవారం పీవో ప్రారంభించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు సోలార్ వినియోగంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం విద్యుత్‌శాఖ డీఈ వెంకటరమణ సోలార్ ప్రాముఖ్యత, వినియోగం, సబ్సిడీపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఏడీఈ సుధీర్‌బాబు, ఏఈ శ్రీనివాసరావు, సోలార్ వెండర్ రాజేష్, లైన్ ఇన్‌స్పెక్టర్ గణేష్ పాల్గొన్నారు.


