అసత్య ఆరోపణలు తగవు
గూడెంకొత్తవీధి: మండలంలోని సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో అక్రమ తవ్వకాల విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఎటువంటి ప్రమేయం లేదని, దీనిపై కూటమి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, నాయకులు అరుణ్‌కుమార్, చంటిబాబు, నారాయణ అన్నారు. వారు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అని, యంత్రాంగం అండదండలతో అధికారులు, సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి కూటమి నాయకులు తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారన్నారు. ఈ వ్యవహారంలో అనవసరంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై నిందలు వేస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇకపై వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాయకులు భాను, గౌతమ్ పాల్గొన్నారు.


