కొనసాగుతున్న చలి తీవ్రత
● జి.మాడుగులలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత ఎక్కువ ఉంటోంది. బుధవారం జి.మాడుగులలో 5.4 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ముంచంగిపుట్టులో 7.0, అరకువ్యాలీ, డుంబ్రిగుడలో 7.2, చింతపల్లిలో 7.5, పెదబయలులో 7.8, పాడేరులో 8.3, హుకుంపేటలో 9.3, వై.రామవరంలో 9.9 డిగ్రీల నమోదు అయ్యాయని ఆయన వెల్లడించారు.
డుంబ్రిగుడ: మండలంలో చలి, మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. మంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.


