రోగులకు మెరుగైన సేవలు
రంపచోడవరం: పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని స్థానిక ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆదేశించారు. ఆయన బుధవారం మారేడుమిల్లి పీహెచ్‌సీ, దేవరపల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది వివరాలతోపాటు రోజుకు ఎంత మంది రోగులకు వైద్య సేవలు అందుతున్నాయో తెలుసుకున్నారు. దేవరపల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో మాట్లాడారు. మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో బోధన చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు కాచి చల్చారిన నీరు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరును తెలుసుకున్నారు. అనంతరం రబ్బరు ప్రొసెసింగ్ యూనిట్‌ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రబ్బరు ప్రొసెసింగ్, ట్యాపింగ్ వివరాలు తెలుసుకున్నారు. పీవో వెంట పీహెచ్‌వో పి.దేవదానం, ఏటీడబ్ల్యూ శంభుడు, హెచ్‌ఎం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్
రోగులకు మెరుగైన సేవలు


