వేర్వురు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు
డుంబ్రిగుడ: మండలంలోని కురిడి పంచాయతీ నారింజవలస గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న సంఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అరకు నుంచి డుంబ్రిగుడ వస్తున్న ఆటోను అరకులోయ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్‌టేక్ చేయబోయి ఆటోను వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఆటో బోల్తాపడడంతో అందులో ఉన్న 8 మంది ప్రయాణికుల్లో అయిదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులో సహాయంతో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు అంత పోతంగి పంచాయతీ కోసంగి గ్రామనికి చెందిన వారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో, స్కూటీ ఢీ–ముగ్గురికి గాయాలు
మండల కేంద్రానికి సమీపంలో ఏకలవ్య పాఠశాల సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆటో, స్కూటీ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు గిరిజన యువకులకు గాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కించుమండ వారపు సంత నుంచి డుంబ్రిగుడ వైపు వస్తున్న ఆటో, డుంబ్రిగుడ నుంచి కించుమండకు వెళ్తున్న స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో చంపాపట్టి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానికులు డుంబ్రిగుడ పీహెచ్‌సీకు తరలించారు.
నారింజవలసలో ఆటోను ఢీకొన్నఆర్టీసీ బస్సు...అయిదుగురికి గాయాలు
వేర్వురు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు


