బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు మరింత విస్తృతం
సీలేరు: జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ ద్వారా సేవలను విస్తృతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ డిఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీబిఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్స్, ఓఎఫ్‌సీ ద్వారా ఇంటర్నెట్ సేవలను మెరుగుపరిచేందుకు కొత్త సాంకేతిక విధానం ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఒకవేళ నర్సీపట్నం, చింతపల్లి, గూడెం కొత్తవీధి, సీలేరు మధ్యలో ఓఎఫ్‌సీ తెగిపోయిన, ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచినా వెనువెంటనే డొంకరాయి మీదుగా రాజమండ్రి ఓఎఫ్‌సీ కేబుల్‌కు అనుసంధానమై సిగ్నల్స్‌లో అంతరాయం లేకుండా ఉంటుందన్నారు.
16 టవర్లు ఏర్పాటు
ప్రస్తుతం సీలేరు పరిసర ప్రాంతాల్లో 16 బిఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా ప్రస్తుతం సీలేరులో ఉన్న నాలుగు టవర్లు కండిషన్లో ఉంటూ 4జీ సేవలను నిరంతరాయం అందిస్తున్నాయన్నారు. అదే విధంగా ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను కూడా విస్తతం చేయనున్నామన్నారు. ఇందులో భాగంగా గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఫైబర్‌నెట్ సేవలు కూడా అందుబాటులో తీసుకొస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా ఈ సేవలపై బృందాల ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ భారత్‌నెట్ ఉద్యమి అనే కొత్త ఆఫర్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు ఇంటర్నెట్ కనెక్షన్లు వేస్తామన్నారు. ఇందుకుగాను అయ్యే బిల్లును ప్రభుత్వమే భరిస్తుందని డీఈ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మండలంలోని గాలికొండ పంచాయతీ సప్పర్లలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ని కూడా ఆధునీకరిస్తామని, త్వరలోనే పూర్తిస్థాయిలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జేటీవో ఇన్‌చార్జి ప్రవీణ్, ఫైబర్‌నెట్ ఆపరేటర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీఈ శ్రీనివాసరావు


