అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
డీపీవో చంద్రశేఖర్
చింతూరు: డివిజన్‌ల అభివృద్ధి కార్యక్రమాలపై చింతూరు, కూనవరం, ఎటపాక, వి.ఆర్.పురం మండలాల అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సకాలంలో ఇంటిపన్నులు వసూలు చేయాలని, సచివాలయ భవనాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం చిడుమూరు పంచాయతీ పరిధిలో పర్యటించిన ఆయన తడిచెత్త, పొడిచెత్త సేకరణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చిడుమూరులో అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాన్ని పరిశీలించిన ఆయన వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో విజయ్‌కుమార్, ఎంపీడీవోలు, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


