విద్యార్థి అదృశ్యంపైకేసు నమోదు
రాజవొమ్మంగి: స్థాని క ఆశ్రమ పాఠశా లలో ఆరవ తరగతి చదువుతున్న కొక్కు ల సందీప్ కనిపించకపోవడంతో మి స్సింగ్ కేసుగా నమోదు చేసినట్టు ఎస్‌ఐ శివకుమార్ శనివారం తెలిపారు. ఆయన అందజేసిన వివరాల ప్రకారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న సందీప్‌ను నానమ్మ ఈ నెల 4న ఆశ్రమ పాఠశాలలో చేర్పించగా 10వ తేదీ నుంచి సందీప్ కనుపించకపోవడంతో అతని ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం కానరాలేదు. దీంతో నానమ్మ మరియమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. బాలుడు కనిపిస్తే స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ శివకుమార్ కోరారు.


