పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
అనంతగిరి(అరకులోయటౌన్): రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే కూటమి ప్రభుత్వ అక్ష్యమని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం మండలంలోని గుమ్మకోటలో మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనప్న అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగ మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రయివేటికరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య కలగా మిగులుతుందన్నారు. రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ఒక్కో మెడికల్ కాలేజీకి రూ. 500కోట్లు కేటాయించి 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారని, ఆయా కళాశాలలు కళాశాలలన్ని ప్రారంభించినట్లయితే ఎంతో మంది పేద విద్యార్ధులకు వైద్య విధ్య చదువుకునే అవకాశం ఉండేదన్నారు. మెడికల్ కాలేజీల ప్రయివేటికరణతో పేదలకు కూడ మెరుగైన వైద్యం దూరం అరుతుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రయివేటికరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.
● భీమవరం ఎస్సీకాలనీలో రూ. 3లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే మత్స్యలింగం శంకుస్ధాపన చేసారు. స్ధానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులను పరామర్శించారు. గుమ్మకోట సచివాలయంలో బిర్షాముండా 150వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● గుమ్మకోట ఏపీ గురుకులం బాలుర పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ, స్టోర్ రూమ్ పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ ఉపాద్యాక్షుడు పాడి కృష్ణామూర్తి, గుమ్మకోట ఎంపీటీసీలుఅశోక్, టి. రాంబాబు, సర్పంచ్‌లు పాగి అప్పారావు, సెంబి సన్యాశిరావు, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్నదోర, వార్డు సభ్యుడు ఎం. కృష్ణ, మాజీ సర్పంచ్ జన్ని చిన్నయ్య, నాయకులు చందు పట్నాయిక్, టి. రాంబాబు, మామిడి అప్పలకొండ, మహేష్, సుందర్‌రావు, బుట్టన్న, జన్ని కన్నయ్య, శంకర్‌రావు, సన్యాశిరావు, ప్రసాద్, పెంటయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం


