సూపర్ సిక్స్ పేరుతోచంద్రబాబు ప్రభుత్వం మోసం
డుంబ్రిగుడ: స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు, పదవి వ్యామోహం కోసమే వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి డుంబ్రిగుడ మండల అరకు సెగ్మెంట్ ఎంపీటీసీ వరహాలమ్మ ఆమె భర్త నాగేశ్వరరావు దంపతులు మారారని మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావులు అన్నారు. ఈ సందర్భంగా శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ అనేక వాగ్ధానాలు ఇచ్చి మోసం చేస్తున్న టీడీఏలో చేరిన చంద్రబాబు మోసాలను మోసపోవడమే తప్పితే ఉపయోగం ఉండదని వెల్లడించారు. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. మండల కార్యదర్శులు మఠం శంకర్, రామునాయుడు, విజయదశమి పాల్గొన్నారు.


