వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు తీవ్ర అన్యాయం
పాడేరులో సేకరించిన సంతకాలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు
అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
పాడేరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మత్య్సరాస
విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ
పాడేరు : రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల వైద్యపరంగా పేద, మధ్యతరగతి ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వారపు సంతలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు అధ్యక్షతన ఆయన కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిన ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హాజరయ్యారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2వేల మంది సంతకాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు, తనూజరాణి, పాల్గుణ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఆయా ప్రాంతాల్లో వైద్య విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వైద్య కళాశాలలను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించారన్నారు. ఆయనకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో పాటు తమ స్వలాభం కోసమే ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రైవేటుపరం చేసిన వైద్య కళాశాలలను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువస్తారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి కూతంగి సూరిబాబు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్‌పర్సన్ లకే రామసత్యవతి, సర్పంచ్‌లు వనుగు బసవన్నదొర, గొల్లోరి నీలకంఠం, సోమెలి లక్ష్మణరావు, గబ్బాడ చిట్టిబాబు, ఎంపీటీసీ దూసురి సన్యాసిరావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు గల్లెలి లింగమూర్తి, పార్టీ మండల ఉపాధ్యక్షులు పాంగి నాగరాజు, ఎం.కన్నాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
పాడేరులో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన
ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా
వ్యతిరేకించిన అన్నివర్గాల ప్రజలు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు తీవ్ర అన్యాయం


