రోడ్డు ప్రమాదంలోవ్యక్తికి తీవ్ర గాయాలు
రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన రెహమాన్‌కు తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. జిల్లాలోని చింతపల్లి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో భాగంగా స్కూటీపై స్వగ్రామం బయలుదేరారు. మార్గంమధ్యలో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. వెంటనే ఆయనను 108లో జడ్డంగి పీహెచ్‌సీకు తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం అందించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జడ్డంగి ఎస్‌ఐ చినబాబు తెలిపారు.


