కొయ్యూరులోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్
● అరకు మాజీ ఎంపీ మాధవి డిమాండ్
కొయ్యూరు: కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ మ న్యంలోనే ఏర్పా టు చేయాలని అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తున్నట్టు ఆమె తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ యూనిట్‌ను మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని తామ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.గతంలో కొయ్యూరు మండలం డౌనూరులో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు దానిని గొడౌన్‌గా ఉంచి యూనిట్‌ను అనకాపల్లి జిల్లా మాకవరపాలెం సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోందన్నారు. దీని మూలంగా గిరిజనులు ఉపాధి అవకాశాలు కోల్పోతారని తెలిపారు. గిరిజనులకు ఉపయోగపడే విధంగా దానిని గిరిజన ప్రాంతంలో నర్సీపట్నానికి సమీపంలో ఉన్న కొయ్యూరు మండలంలో ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.


