ఏజెన్సీలో విలువిద్య అకాడమీ
సాక్షి,పాడేరు: జిల్లాలో క్రీడాభివృద్ధి కార్యక్రమాలతో పాటు విలువిద్య అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. వందేమాతరం గీతం ఆలపించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి ఈ పోటీలకు హాజరైన 950మంది క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విల్లు ఎక్కుపెట్టి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటంలో విలువిద్యతోనే బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఎదురించారని, అదే స్ఫూర్తితో బాలబాలికలు విలువిద్యలో రాణించాలని సూచించారు. ఇప్పటికే అరకులోయలో క్రీడా పాఠశాల ఉందన్నారు. అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి నిధులు రూ.20లక్షలతో పాడేరులోని ఇండోర్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నకుమారి, ఎంపీటీసీ ఉషారాణి, డీఈవో పి.బ్రహ్మజీరావు, సర్వశిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, రాష్ట్ర పరిశీలకులు రమణ, నారాయణరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అఽధికారి జగన్మోహనరావు, ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమణ, టెక్నికల్ చైర్మన్ శ్రావణ్‌కుమార్, కోశాధికారి కృష్ణకుమారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఽఎస్.శ్రీనివాసరావు,ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు పాంగి సూరిబాబు,భవాని పాల్గొన్నారు.
ఉత్సాహంగా పోటీలు
రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలు తొలిరోజు ఉత్సాహంగా జరిగాయి.శుక్రవారం సాయంత్రం పలు జిల్లాలకు చెందిన అండర్ 14,17,19 విభాగాల బాలిబాలికలంతా 70,100 మీటర్ల విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. విజేతలను ఆదివారం ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఏర్పాటుకు చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడి
పాడేరులో రాష్ట్రస్థాయి
పోటీలు ప్రారంభం
950 మంది క్రీడాకారుల హాజరు
ఏజెన్సీలో విలువిద్య అకాడమీ
ఏజెన్సీలో విలువిద్య అకాడమీ


