అప్పుల బాధతో చిట్టీల వ్యాపారి ఆత్మహత్య
ఎటపాక: అప్పుల బాధతో చిట్టీల వ్యా పారి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ఎటపాక గ్రామానికి చెందిన భూక్యా బాల్యా (60) కొంత కాలంగా చిట్టీల వ్యాపా రం నిర్వహిస్తున్నారు. దీంతోపాటు గత 20 ఏళ్లుగా సరిహద్దున ఉన్న తెలంగాణలోని భద్రాచలం పట్టణంలో మహలక్ష్మి ఏజెన్సీస్ పేరుతో పెయింట్స్ వ్యాపారం కూడా చేస్తున్నారు. అయితే చిట్టీలు పాడుకున్న సభ్యులు సకాలంలో నగదు చెల్లించకపోవడంతో సుమారు రూ.5కోట్ల మేర అప్పులపాలయ్యారు. దీంతో వాటిని తీర్చలేక ఆయన మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత కలుపు మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. అక్కద వైద్యం పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. మృతుడి కుమారుడు కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


