జన్‌మన్ బిల్లు బకాయిలు చెల్లించాలి
ముంచంగిపుట్టు: పీఎం జన్‌మన్ పథకంలో నిర్మించిన గృహాల బిల్లు బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.ధర్మానపడాల్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల గిరిజన సంఘం నేతలతో హౌసింగ్ బకాయిలు, లబ్ధిదారుల ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం జన్‌మన్ గృహాలు నిర్మించుకుని బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గిరిజనులు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారిన, హౌసింగ్ బిల్లులు రెండు నెలలుగా విడుదల కాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘ మండల అధ్యక్షుడు ఎంఎం.శ్రీను, కార్యదర్శులు నర్సయ్య, గంగాధరం, లక్ష్మీపురం సర్పంచ్ త్రినాథ్, గిరిజన సంఘ నాయకులు రాందాసు, దొంబరు, జీనబంధు, నీలకంఠం, బుజ్జిబాబు, దేవన్న, కొండయ్య,సిద్ధేశ్వరరావు, గోపాల్, గణపతి పాల్గొన్నారు.
గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడుధర్మానపడాల్ డిమాండ్


