
బావిలో దూకి ఆర్టీసీ కండక్టర్ మృతి
పాడేరు : మద్యానికి బానిసై కొంతవరకు మతిస్థిమితం కోల్పోయిన ఓ ఆర్టీసీ కండక్టర్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సురేష్ అందించిన వివరాలిలా ఉన్నా యి. విశాఖపట్నం మర్కాపురానికి చెందిన మారెట్ల లక్ష్మీ నారాయణమూర్తి అనే ఆర్టీసీ కండక్టర్ పాడేరు ఆర్టీసీ డిపోలో ఐదేళ్లుగా పనిచేశాడు. ఆ తర్వాత గాజువాక డిపోలో పనిచేస్తున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. విధులకు తరచుగా గైర్హాజరుతో సస్పెండ్ అయ్యాడు. వారం రోజుల క్రితం అతడికి వాల్తేర్ డిపోకు బదిలీ చేశారు. గత కొంతకాలంగా భార్య, కుటుంబంతో దూరంగా ఉంటున్న ఆయన పాడేరు పట్టణంలోని ఐటీడీఏ రేకుల కాలనీలో ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో పాడేరులో ఉంటున్న ఆయన శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె అతడి ఆచూకి కోసం గాలించింది. కానీ జాడ తెలియలేదు. ఆదివారం ఉదయం బావిలో నీటి కోసం వెళ్లిన స్థానిక మహిళలు మృతదేహం తేలియాడుతుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు లక్ష్మీనారాయణగా గుర్తించి, కాకినాడలో నివాసముంటున్న మృతుడి భార్యకు సమాచా రం ఇచ్చారు. పాడేరు వచ్చిన ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బావిలో దూకి ఆర్టీసీ కండక్టర్ మృతి