
భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం
రాజకీయ నాయకులు ఇచ్చిన ప్రకటన, స్టేట్‌మెంట్‌ను రాస్తున్న విలేకరులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(ఏ) భావ ప్రకటనకు స్వేచ్ఛ ఇచ్చింది. ఇది జర్నలిస్టులకు రక్షణ ఇస్తుంది. అలాంటిది వారిపై కేసులు నమోదు చేయడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికల్లో ప్రచురితమవుతున్న కథనాల్లో ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వం లేదా ఇతరులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా వచ్చిన వార్తపై రిజాయిండర్ ఇవ్వాలి. అలా కాకుండా నేరుగా కేసులు నమోదు చేయడం సరైంది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే భావిస్తున్నాం. నిజాలను రాసే వారిపై ఇలా కేసులు పెట్టడం సరికాదు. ఇలాంటి చర్యలు పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించనట్టుగా భావించాల్సి ఉంటుంది. – గొడ్డేటి మాధవి, అరకు మాజీ ఎంపీ

భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం