
అవగాహన కల్పిస్తున్నాం
గిరి రైతులు వలిసె సాగులో దిగుబడులు తగ్గడంపై ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దత్తత తీసుకున్న దుచ్చరపాలెంలో ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా మేలు రకాల విత్తనాలు 100 కిలోలు పంపిణీ చేశాం. వీటితోపాటు ఆకాశపందిరి కలుపు మొక్క నివారణకు సూచనలిచ్చాం. ఇదే కాకుండా జల్లెడలు, టార్పాలిన్లు అందజేశాం. తేనెటీగలు మనుగుడ తగ్గడంతో కూడా ఈ పంట దిగుబడి తగ్గుతుంది. వీటి పెంపకానికి రైతులను అవగాహన కల్పిస్తున్నాం.
– బయ్యపురెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త,
ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లి
రాయితీపై విత్తనాలివ్వాలి
వరి, రాజ్‌మా విత్తనాలు మాదిరిగానే వలిసె విత్తనాలను రాయితీపై పంపిణీ చేయాలి. విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల సాగు చేపట్టలేకపోతున్నాం. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి రాయితీపై విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి.
– బౌడు కుశలవుడు, రైతు, గొందిపాకలు, చింతపల్లి మండలం

అవగాహన కల్పిస్తున్నాం