
అన్ని అంశాలపై అవగాహన అవసరం
పాడేరు మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ వేణుగోపాల్
రంపచోడవరం: యువతులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని పాడేరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బి. వేణుగోపాల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉమెన్, చైల్డ్ సేఫ్టీపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థినులంతా శక్తి యాప్‌ను కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మహిళలకు ఆపద సమయంలో ఇది ఉపయోగపడుతుందన్నారు. అలాగే గుడ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం గురించి వివరించారు. సైబర్ మోసానికి గురైతే తక్షణం పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనుకోని అపద నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ వెంకట్రావు, ప్రిన్సిపాల్ డా. కె వసుద తదితరులు పాల్గొన్నారు.