
నలుగురు పట్టు రైతులకు అవార్డులు
కూనవరం: మండలం పరిధిలో బోరునూరు కేంద్రంగా టసార్ పట్టు సాగుచేస్తున్న నలుగురు రైతులు చదల కన్నపరెడ్డి, చిచ్చడి వీర్రాజు, చిచ్చడి కన్నమ్మ, కారం దుర్గ అవార్డులు పొందారు. అన్నయ్య జిల్లా మడకశిరలో గురువారం నిర్వహించిన ‘నా పట్టు నా అభిమానం’ కార్యక్రమంలో 30 టీమ్‌లు పాల్గొన్నాయి. కూనవరం మండలానికి చెందిన టీమ్ టసార్ పట్టు కాయల ఉత్పత్తిలో అధిక దుగుబడి సాధించి అవార్డును దక్కించుకుంది. వీరికి ఎంపీలు బి.కె. పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తదితరుల చేతులమీదుగా అవార్డుల అందజేసినట్టు సెరీకల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్(ఏఎస్‌వో) వెంకట హరికృష్ణ తెలిపారు.