
బెర్రీ బోరర్‌పై రైతులకు అవగాహన అవసరం
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
జి.మాడుగుల: కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ పురుగుపై రైతులకు అవగాహన అవసరమని శాస్త్రవేత్తలు, కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. మండలంలో కె.కోడాపల్లి, సొలభం,గడుతూరు, గెమ్మెలి, వంజరి, పాలమామిడి, జి.మాడుగుల తదితర 17 పంచాయతీల్లో కాఫీ తోటలను శుక్రవారం శాస్త్రవేత్తలు పరిశీలించి, బెర్రీ బోరర్ పురుగుపై సర్వే నిర్వహించారు. కర్ణాటక కాఫీబోర్డు నుంచి వచ్చిన ఎస్‌ఎల్‌వో కామారెడ్డి ప్రభుగౌడ, ఈఐలు సుదీష్,స్రవంతి, ఎఫ్‌సీ జగదీష్ పాత్రుడు, మాలీ సీతారాం తదితరులు బెర్రీ బోర్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లైజన్ వర్కర్లు వెంకట్,మోహన్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.