
పోడు వ్యవసాయం చట్టరీత్యా నేరం
సీలేరు: పోడు వ్యవసాయం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తోకరాయి అటవీశాఖ సెక్షన్ అధికారి సతీష్ చెప్పా రు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చోడురాయి గ్రామస్తులకు పోడు వ్యవసాయంపై ఎవరూ ప్రోత్సహించలేదన్నారు. తోకరాయి గ్రామస్తుల ఆరోపణలు అవాస్తవమన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఎక్కడా చెట్టు నరికినా, పోడు వ్యవసాయం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెండు గ్రామాల మధ్య ఉన్న అంతర్గత సమస్యలతో అటవీ అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదని ఆరోపించారు.