
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వైఫల్యాలే అని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. దేవీపట్నం మండల ఇందుకూరుపేలో శుక్రవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఎమర్జన్సీని తలపిస్తుందన్నారు. ఎన్నికల హామీలు అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ప్రాంత పర్యటనల్లో తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారన్నారు. జగనన్నపై ప్రజలు చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలు ఇది గమనిస్తున్నారని త్వరలో బుద్ధి చెబుతారన్నారు. ప్రజలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతోందన్నారు. ప్రజల పక్షాన్న వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అమలుచేయని పథకాలు, వైఫల్యాల సమాచారంతో రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎంపీపీ కుంజం మురళీ, జెడ్పీటీసీ సభ్యురాలు శిరసం సత్యవతి, వైస్ ఎంపీపీ గారపాటి మురళీ, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే
నాగులపల్లి ధనలక్ష్మి

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం