
వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతికి నివాళి
ముంచంగిపుట్టు: మండలంలో గల పెదగూడ పంచాయతీ గూడమాలిపుట్టు గ్రామానికి చెందిన గుడియా మాణిక్యం(61) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్ప్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ జిల్లా, మండల నేతలు శుక్రవారం గూడమాలిపుట్టు గ్రామానికి వెళ్లి మాణిక్యం పార్దీవదేహానికి వైఎస్సార్‌సీపీ పార్టీ జెండాను కప్పి, నివాళులర్పించారు. మాణిక్యం భార్య మత్యమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే పాల్గుణలు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పార్టీ కోసం మాణిక్యం చేసిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. ప్రతి కార్యకర్తకు వైఎస్సార్‌సీపీ అధినేత జగనన్న తోడుగా ఉంటారని, మాణిక్యం కుటుంబ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అనంతరం నిర్వహించి అతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే పాల్గుణ పాల్గొని మాణిక్యం పాడెను మసాశారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, సర్పంచులు రమేష్, బాబూరావు, నీలకంఠం, గంగాధర్, నరసింగరావు, ఎంపీటీసీ సభ్యుడు గణపతి, జెసీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ జగబంధు, మండల పార్టీ కార్యదర్శిలు రాంప్రసాద్, సన్యాసిరావు, నేతలు జయదేవ్, మూర్తి, అప్పారావు, గాసిరావు, మత్స్యలింగం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతికి నివాళి