
రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో మెరిసిన ఏకలవ్య విద్యా
● బంగారు, వెండ పతకాలు
సాధించిన గిరి బాలలు
● జాతీయ స్థాయి పోటీలకు
పలువురు ఎంపిక
రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ఏకలవ్య
విద్యార్థులతో ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు
బంగారు, వెండి పతకాలు సాధించిన
వరుణ్‌సందేశ్, ప్రవీణ్‌లతో ప్రిన్సిపాల్ సుమన్
ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు గుంటూరులోని ఆచార్య నాగార్జన యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఈ నెల 7 నుంచి 9తేదీ వరకు నిర్వహించిన 2025–26 రాష్ట్రస్థాయి 4వ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల స్పోర్ట్స్ మీట్‌లో సత్తాచాటారు.రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో వరణ్‌సందేశ్ కెప్టెన్‌లో పాటు సాయి, హేయసాయిలాస్, బాబూజీ, జోస్‌మాన్, మోహన్‌దాసు, మనోహర్, నవీన్‌కుమార్ ప్రతిభ కనబరిచి దిత్వీయ స్థానంలో నిలిచారు. అండర్ 14షార్ట్ పుట్‌లో ప్రవీణ్ బంగారు పతకం, అండర్ 19 డిస్కస్‌త్రో లో వరుణ్‌సందేశ్ వెండి పతకం, అండర్ 19 విభాగంలో 57 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో కె.అనిత, 62 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో ఎస్.శృతి బంగారు పతకాలు సాధించారు. వచ్చే నెల ఒడిశా రాష్ట్రం కటక్‌లో జరిగే నేషనల్ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఖోఖోలో నందు, బ్యాడ్మింటన్‌లో హర్ష, వాలీబాల్ అండర్ 19 విభాగంలో సిద్ధు ఎంపికయ్యారు. శుక్రవారం ఏకలవ్య ప్రిన్సిపాల్ సుమన్, పీటీలు సుమిత్,నందిని,ఉపాధ్యాయులు సత్తా చాటిన విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు రాణించి,పాఠశాలకుమరింత పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ సుమన్ పాటు ఉపాధ్యాయులు కోరారు.

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో మెరిసిన ఏకలవ్య విద్యా