
తప్పుడు ఆరోపణలు తగదు
రంపచోడవరం: కొంత మంది గిరిజనేతరులు నరసాపురం గ్రామస్తులను రెచ్చగొట్టి నిరంతరం ఆదివాసీల కోసం పాటుపడుతున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. నరసాపురం గ్రామంలో క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులతో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడారు. క్వారీ వల్ల నష్టపోతున్న గిరిజనులు తమను ఆశ్రయించడం వల్లే బాధితుల తరఫున ఆదివాసీ సంక్షేమ పరిషత్ నిలిచి జాతీయ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసిందన్నారు. వాటాల కోసం, డబ్బులు కోసం క్వారీపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్న వారికి, వెనుక ఉన్న కుట్రదారులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గ్రామంలో కొంత మంది క్వారీ లెక్కలు చెప్పాలని అడగడంతో బినామీలు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడం, దీనిపై వారు ఐటీడీఏ పీవో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గ్రామం మొత్తం ఉండాల్సినటువంటి క్వారీలో వారిని కూలీలుగా మార్చి, క్వారీ నిర్వహణదారులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే దేనికై నా సిద్ధమేనని సవాల్ చేశారు. నిజాల నిగ్గు తేలడమే కాకుండా కోర్టు ద్వారా బాధితులకు న్యా యం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబూరావు, కోఆర్డినేటర్ పీట ప్రసాద్ పాల్గొన్నారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను