
లిక్విడ్ గంజాయితో ముగ్గురు పట్టివేత
2 లీటర్ల హాష్ ఆయిల్, మూడు బైక్‌లు, రూ.50 వేల నగదు స్వాధీనం
లిక్విడ్ గంజాయి తరలిస్తున్న
వ్యక్తులను పట్టుకున్న పెందుర్తి పోలీసులు
పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయి(హాష్ ఆయిల్)ను నగరానికి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సరిపల్లి చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు లీటర్ల హాష్ ఆయిల్, మూడు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్‌లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి.. అల్లూరిసీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం డొన్నలవలస గ్రామానికి చెందిన సమారిడి అర్జున్, పైనంపాడుకు చెందిన డుంబరి స్వామి, డుంబ్రిగుడ మండలం పోతంగికి చెందిన డుంబరి జోయో మూడు బైక్‌లపై విశాఖ నగరానికి హాష్ ఆయిల్ తరలిస్తున్నారు. సరిపల్లి చెక్‌పోస్టు వద్ద పెందుర్తి పోలీసులు జరిపిన తనిఖీల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎస్‌ఐ దేముడునాయుడు బృందం వారిని చాకచక్యంగా పట్టుకుని లిక్విడ్ గంజాయితో పాటు బైక్‌లు, నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ కేవీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.