
‘నిరసన వారం’విజయవంతం చేయండి
● ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడురావుల జగన్‌మోహన్‌రావు పిలుపు
జి.మాడుగుల: ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ఈనెల 17వరకు ఏపీటీఎఫ్ తలపెట్టిన నిరసన వారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రావుల జగన్‌మోహన్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని పెదలోచలి, గద్దెరాయి మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. పెడింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. వీటితోపాటు మెమో నంబరు 57ను తక్షణమే అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. అంతేకాకుండా అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్స్‌ను అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.