జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి

Sep 11 2025 2:43 AM | Updated on Sep 11 2025 2:43 AM

జ్వరం

జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి

రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న కొంతం జగజ్జనని (30) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈమె గత నెల 30న జ్వరానికి చికిత్స నిమిత్తం లాగరాయి పీహెచ్‌సీకి వెళ్లింది. తగ్గకపోవడంతో ఏలేశ్వరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెకు డెంగ్యూ జ్వరం అని రక్త పరీక్షల్లో తేలింది. చికిత్సకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఆమె మూడు రోజుల క్రితం కాకినాడ జీజీహెచ్‌లో అడ్మిట్‌ అయిందని ఆమె బంధువు బాబ్జి తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు ఆయన వివరించారు. ఈమెకు బాబు (7) ఉన్నాడు. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం వలస వెళ్లిన భర్త ఇప్పటికీ తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె మరణం చిన్నారికి దిక్కు లేకుండా చేసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అధ్వానంగా పారిశుధ్యం

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. మురుగు, దోమలతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు జ్వరం, కీళ్ల నొప్పులతో మంచాన పడ్డారు. గత రెండు నెలల్లో ఈ ప్రాంతానికి చెందిన 12 మందికి లాగరాయి పీహెచ్‌సీ ద్వారా రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా ఇద్దరికి చికెన్‌గున్యా నిర్థారణ అయింది. జ్వర పీడితులు పెరగడంపై ప్రత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఈనెల 9న ఈ ప్రాంతానికి వచ్చి సమీక్షించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం లోపించడంపై పంచాయతీ సిబ్బందిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటామని, జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో జగజ్జనని మరణించడం ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. లోతట్టు గ్రామాలు మాత్రమే కాకుండా రంపచోడవరం ఎమ్మెల్యే పంచాయతీ కిండ్ర తదితర గ్రామాల్లో జ్వరాలతో మంచం పట్టిన రోగులకు ముందుగానే వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి నెలకొనేది కాదని పలువురు పేర్కొంటున్నారు.

కొనసాగుతున్న

ప్రత్యేక వైద్య శిబిరాలు

లాగరాయి, కిండ్ర గ్రామాల్లో మూడు రోజులుగా ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల వైద్యులు కిండ్రలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. రోగాలకు కారణాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా 22 మందికి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపారు. రంగరాయ వైద్య కళాశాలకు చెందిన వైద్య నిపుణులు పి. శ్రీనివాస్‌, సత్యనారాయణ, సత్య చంద్రిక (మైక్రో బయోలజీ), హరీష్‌, పావని, ఏడీఎంఅండ్‌హెచ్‌వో డేవిడ్‌ పాల్‌ సేవలందించారు.

తల్లి ప్రేమకు దూరమైన కుమారుడు

మృతి చెందినజగజ్జనని (ఫైల్‌)

జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి1
1/2

జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి

జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి2
2/2

జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement