
మోసపూరిత హామీలతో అరాచక పాలన
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలను మోసం చేసిందని అందుకే వారి తరుపున ప్రజల గొంతుకై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మారేడుమిల్లిలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకురావడం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంస్కరణలు తీసుకువస్తే .. చంద్రబాబు నాయుడు వాటి ధ్వంసం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలతో గద్దినెక్కిన కూటమి పార్టీ ఎటువంటి పథకాలు అమలుచేయకుండా నాయకులు కథలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజాపాలనను విస్మరించి, ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తోందన్నారు. అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఎంపీపీ సార్ల లలితకుమారి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సత్తి సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ జాకబ్, వైస్ ఎంపీపీ లక్కొండ రవికుమార్, లత,ఎంపీటీసీ గొర్లె అనిల్, కోఆప్షన్ సభ్యుడు గురుకు ధర్మరాజు, నాయకులు గంగరాజు, వీరబాబు, దూడ స్మిత్ పాల్గొన్నారు.

మోసపూరిత హామీలతో అరాచక పాలన