
అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం
అనంతగిరి (అరకులోయ టౌన్): నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆయ న సోమవారం మండల కేంద్రంలో పర్యటించి అంగన్‌వాడీ భవనం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతగిరి–1 అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా నిధులు కేటాయించినప్పటికీ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో ఎంపీపీ శెట్టి నీలవేణి ప్రత్యేక శ్రద్ధతో రూ.7.50 లక్షలు, జెడ్పీటీసీ దీసరి గంగరాజు రూ.2 లక్షల జెడ్పీ నిధులు కేటాయించి అంగన్‌వాడీ భవనం పూర్తి చేయడానికి చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు.
హాస్టల్ కొత్త భవనం నిర్మించాలని వినతి
జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి గృహం శిథిలావస్థకు చేరిందని వచ్చిన వార్తలకు స్పందించిన ఎమ్మె ల్యే కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో తలదాచుకోలేని విధంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్య క్తం చేశారు. నూతన వసతి గృహ భవనం నిర్మించా లని ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. తా త్కాలికంగా వేరే భవనంలో వస తి గృహం నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దీసరి గంగరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్న దొర, సర్పంచ్‌లు సోమల రూతు, సన్యాసిరావు పాల్గొన్నారు.