
జిల్లాస్థాయి మారథన్ పోటీలు ప్రారంభం
అరకులోయటౌన్: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి మారథన్ 5కె రన్‌ను అల్లూరి సీతారామ రాజు జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబి అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా జిల్లా స్థాయి మారధన్ రన్ ను జిల్లా వైద్య విధ్యాధికారి విభాగం సహకారంతో జరిపార. పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్‌లో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ పోటీలో పురుషులు, మహిళలలకు ప్రథమ బహుమతిగా ఒక్కొక్కరికి రూ.10వేలు, ద్వీతీయ బహుమతి పురుషులు, మహిళలకు వేర్వేరుగా రూ. 7వేలను టీబీ అధికారి డాక్టర్ కిరణ్ చేతుల మీదుగా అందజేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్, మహిళా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్స్‌పాల్ పట్టాసి చలపతిరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రామచందర్, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ స్పందన ప్రశాంతి, కళాశాల క్రీడా విభాగం శిక్షకులు నాగబాబు, పీడీ అప్పారావు, డాక్టర్‌లు ఉపేంద్ర, వసంత, 108 సిబ్బంది, ఎయిడ్స్ నియంత్రణ విభాగాల కౌన్సిలర్స్ సిబ్బంది, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.