
ముంపు నుంచి తేరుకుంటున్న జన జీవనం
చింతూరు: గోదావరి, శబరి నదులు శాంతించడంతో రహదారులు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. జనజీవనం తేరుకుంటోంది. వాగు లు ఎగుపోటుకు గురై రహదారులను ముంచెత్తడంతో 20 రోజులుగా పరివాహక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం తెలిసిందే. కుయిగూరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. సోకిలేరువాగు వరద నీరు శనివారం ఉదయం వరకు రహదారి పైనే ఉంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థు లు రాకపోకలు సాగించేందుకు పడవలను ఆశ్రయించారు. సాయంత్రానికి తగ్గుముఖం పట్టడంతో వరద నీటిలోంచి కాలినడకను గ్రామాలకు చేరుకుంటున్నారు. అన్నవరం వాగువద్ద కాజ్‌వే కొట్టుకుపోవడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ముంపు నుంచి తేరుకుంటున్న జన జీవనం