
ఒకరోజు ముందుగానే వెళ్తున్నా..
పరీక్ష రాసేందుకు శనివారం వెళ్లాల్సిఉన్నా వరద నీరు అడ్డంకిగా ఉండటంతో ఒకరోజు ముందుగానే కాకినాడ వెళ్లాల్సి వస్తోంది. మా గ్రామం నుంచి వాహనంపై వరద ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి పడవపై వరద నీరు దాటి వాహనంపై చింతూరు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– ముచ్చిక రుచిత, మల్లెతోట, చింతూరు మండలం
వసతి ఎలాగో తెలియడం లేదు
వరద కారణంగా పరీక్ష రాసేందుకు ముందుగానే వెళ్లాల్సి రావడంతో వసతి ఎలాగో అర్థం కావడంలేదు. రూములు తీసుకునేందుకు ఎక్కువ మొత్తం వెచ్చించాలి. వరదలేకుంటే ముందురోజు రాత్రికి చేరుకునేవాళ్లం. కుంజవారిగూడెం నుంచి పడవ వద్దకు వచ్చేందుకు చాల కష్టాలు పడాల్సి వచ్చింది.
– తుర్రం లక్ష్మి, కుంజవారిగూడెం, వీఆర్‌పురం మండలం

ఒకరోజు ముందుగానే వెళ్తున్నా..