
భర్త చేతిలో భార్య హతం
● అనుమానమే కారణం
అడ్డతీగల: వంగలమడుగులో గురువారం మడకం విజయకుమారి (45) అనే మహిళను ఆమె భర్త మడకం జోగిదొర విచక్షణరహితంగా కత్తితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. తెల్లవారుజాము సమయంలో మంచంపై పడుకుని ఉన్న విజయకుమారిని కత్తితో తలపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బంధువులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలోని దుశ్చర్తి పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడు అనుమానంతోనే భార్యను చంపాడని బంధువులు, గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.