
పర్యాటకులకు నిరాశ
అనుకూలించని వాతావరణం
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతం వద్ద పొగమంచు దట్టంగా కురవడంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. మంచు తెరలు అలముకోవడం వల్ల ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారే డుడుమ జలపాత ప్రవాహం కనిపించడం లేదు. ఆదివారం ఎటుచూసినా మంచు కమ్మేయడంతో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్,విజయనగరం తదితర ప్రాంతాలనుంచి వచ్చిన పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
ముఖద్వారం నుంచి వీక్షించి..
డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారికి ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగానే వచ్చారు. చాపరాయి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో ముఖద్వారం నుంచి వీక్షించి వెళ్లిపోయారు.
చెరువులవేనంకు అరకొరగా..
చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగికి సమీపంలోని చెరువులవేనం వ్యూపాయింట్‌కు ఆదివా రం పర్యాటకులు అరకొరగా వచ్చారు. ఏకధాటిగా వర్షాల కురుస్తుండటంతో సందర్శకుల సంఖ్య తగ్గింది.

పర్యాటకులకు నిరాశ

పర్యాటకులకు నిరాశ

పర్యాటకులకు నిరాశ