బాకై ్సట్ అప్పగింత విరమించాలి
● ఈ ఇళ్లకు దారెటు?
8లో
జాతీయ రహదారి పుణ్యమాని మండల కేంద్రమైన చింతపల్లిలో ఇళ్లు కొండెక్కాయి. దాదాపుగా 25 అడుగుల ఎత్తులో ఉన్న రోడ్డును చదును చేయడంతో రోడ్డు కిందకు రాగా గతంలో రోడ్డుకు సమానంగా ఉన్న ఇళ్లు ఇప్పుడు కొండంత ఎత్తులో ఉన్నాయి. సాయిబాబా ఆలయం పక్కన షాపులు, ఇళ్లు కలిసి ఉండేవి. అయితే జాతీయ రహదారి నిర్మాణంతో ఇప్పుడు రోడ్డు డౌన్ అయితే గృహాలు ఎత్తయ్యాయి. ఇప్పుడు ఎత్తులో ఉన్న ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి రహదారి సౌకర్యం కల్పించాలని ఇళ్ల యజమానులు కోరుతున్నారు. – చింతపల్లి


