పథకాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
డుంబ్రిగుడ(హుకుంపేట): సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధికారులకు సూచించారు. మండలంలోని కొంతిలి గ్రామంలో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ్ వర్ష్ వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వం ద్వారా అందే ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయాలన్నారు. చాలా మంది గిరిజనులకు అక్షరాస్యత లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి చాలా మందికి అర్హత ఉన్నా అందకపోవడానికి కారణం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. కొయితిలి, హుకుంపేట సర్పంచ్‌లు రేగం రమేష్, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
పథకాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి


