
ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్
పాడేరు రూరల్: ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ ప్రాంతంలో నూరు శాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసి చేపట్టిన రిలే నిరహార దీక్ష సోమవారంతో 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ముఖి శేషాద్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను మినహయించి ప్రత్యేక ఆదివాసీ డీఎస్సీ ద్వారా ఆదివాసీ అభ్యర్థులతో భర్తీ చేయాలన్నారు. ఎన్నికల హమీలను కూటమి ప్రభుత్వం అమలుచేయకుండా కాలాయాపన చేస్తుండడంతో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు, తక్షణం ప్రభుత్వం స్పందించి ఆదివాసీలు చేస్తున్న డిమాండ్‌లను పరిష్కరం చేయాలన్నారు. నాయకులు రాజబాబు, పడాల్, సద్దు, కేశవరావుపడాల్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
వి.ఆర్.పురం; గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ఇవ్వాలని జీవో నెంబర్ 3కి చట్టబద్దత కల్పించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతూరు నిర్వాహించే రిలే నిరాహార దీక్షకు మద్దతుగా చిన్నమట్టపల్లి సర్పంచ్ పిట్టా రామారావు పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కోటం జయరాజు పాల్గోన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏజెన్సీలో కూటమి ప్రభుత్వం గిరిజనులకు అనేక వాగ్దానాలు చేసిందన్నారు. గిరిజనుల అభ్యర్థుల కోసం ఏజెన్సీ డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
చింతూరు: ఏజన్సీప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అమలుచేస్తూ ప్రభుత్వం వెంటనే జీవో జారీచేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో సచివాలయ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాలు అందజేశారు. డీఎస్సీ నుంచి ఏజన్సీప్రాంత టీచర్ పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్, సుబ్బమ్మ, రాజ్‌కుమార్, కన్నయ్య, సుబ్బారావు, నాగార్జున్, భీమయ్య పాల్గొన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షలకు ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. సోమవారం దీక్షలను ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నెహ్రు, ప్రధాన కార్యదర్శి దారయ్య, సోంది ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏజన్సీప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, సర్పంచ్ పిట్టా రామారావులు సందర్శించి మద్దతు పలికారు. నాయకులు అనిల్, సాయి, శ్రీలక్ష్మి, నవ్య, చందనసాయి పాల్గొన్నారు.

ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్

ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్