
జీడీపీ 15 శాతం పెరుగుదలకు కృషి
సాక్షి,పాడేరు: జీడీపీ 15శాతం పెరుగుదలకు ప్రైమరీ సెక్టార్ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశమందిరంలో వ్యవసాయ, అనుబంధశాఖలు, ఎస్‌ఎంఐ పరిశ్రమలు,స్పైస్‌బోర్డు అధికారులతో సోమవారం నిర్వహించిన వర్కుషాప్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి ప్రైమరీ సెక్టార్‌లో రూ.15వేల కోట్ల వాటా ఉందని, దానిని మరో 15 శాతం పెంచేందుకు గల అవకాశాలపై చర్చిస్తున్నామన్నారు.జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు గిరిజనులను ప్రోత్సహించాలని తెలిపారు. రైతులు సాగుచేస్తున్న పంటల విస్తీర్ణం,మార్కెటింగ్ సదుపాయాలు పెంచడం,అదనపు పంటల విస్తరణ, గ్రేడింగ్, ప్యాకింగ్‌లతో అదనపు విలువలు జోడించడం,నాణ్యత పెంచడం వంటి అంశాల ద్వారా 15 శాతం ఉత్పాదకతను పెంచా లని సూచించారు. నీటి పారుదలశాఖ, మైక్రో ఇరిగేషన్, పరిశ్రమలశాఖల 15శాతం ఉత్పాదతకు సహకరించాలని తెలిపారు. సచివాలయ స్థాయిలో అధికారులు రైతులకు సరైన మార్గదర్శకం చూపాలని సూచించారు. మరో ఐదేళ్లలో ఆర్గానిక్ జిల్లాగా మారనున్న నేపథ్యంలో సంఘాలు,ఎఫ్‌పీవోలుగా ఏర్పడి రైతులు అధిక లబ్ధి పొందాలన్నారు.ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ,సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,సీపీవో పట్నాయక్, వ్యవసాయ, ఉద్యానవన, స్పైసెస్‌బోర్డు, కాఫీ అధికారులు ఎస్.బి.ఎస్.నందు, రమేష్‌కుమార్‌రావు, కల్యాణి, అప్పలనాయుడు, నీతిఆయోగ్ ప్రతినిధులు చైతన్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ట్రైబల్ ఈకామ్
జిల్లాలో రైతులు సంఘాలుగా ఏర్పడి అటవీ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించే విధంగా ట్రైబల్ ఈకామ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులకు సూచించారు. తన కార్యాలయం నుంచి జీసీసీ, వివిధ సంస్థల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు ట్రైబల్ ఈకామ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలో కాఫీ,మిరియాలకు అత్యధిక డిమాండ్ ఉందని,వాటిని బ్రాండింగ్,గ్రేడింగ్ చేయడంపై శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ట్రైబల్ ఈకామ్ ద్వారా మార్కెటింగ్ జరిపితే గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ,అనుబంధశాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్