
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో వంటలు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, సహపంక్తి భోజనం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఉచితంగా తాగునీరు, మజ్జిగ, అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలింతలకు, చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు మజ్జి శ్రీనివాసరావు, కాండ్రేగుల రాజారావు, మారిశెట్టి శంకరరావు, పోలిమేర ఆనంద్, దాడి రవికుమార్, సూరే సతీష్, ఎర్రవరపు లక్ష్మి, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు.

నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు