
1,500లకు పైగా ప్రదర్శనలిచ్చాం
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిగా పనిచేస్తూ 2000లో విశాఖ హ్యూమర్ క్లబ్‌ను స్థాపించాను. హాస్యవల్లరి పేరుతో ప్రతి నెలా రెండో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో క్రమం తప్పకుండా మూడు గంటల పాటు కార్యక్రమం నిర్వహిస్తూ.. నవ్వులు పూయిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 1,500కు పైగా ప్రదర్శనలు ఇచ్చాం. క్లబ్ సభ్యులే కాకుండా, ప్రేక్షకులను కూడా భాగస్వాములను చేస్తూ.. వారితో జోకులు చెప్పించి ప్రోత్సహిస్తున్నాం. నా సహోద్యోగులనే క్లబ్ సభ్యులుగా ఎంచుకున్నాను. మా కార్యదర్శి, నా సహోద్యోగి ఎస్.ఎస్.రామానుజం, సభ్యులు ఆర్.ఎస్.ఎన్.మూర్తి (విశ్రాంత తహసీల్దార్), ఇ.భానుప్రకాష్ (మెడికల్ రిప్రజెంటేటివ్), టీవీ కళాకారిణి ఎం.శివజ్యోతి, కె.నాగగణేష్, సూర్యం క్లబ్‌లో కీలక సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తీరిక సమయాల్లో స్కిట్స్ రూపకల్పన చేసి.. ప్రాక్టీస్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాం.
– రావి గోపీకృష్ణ, విశాఖ హ్యూమర్ క్లబ్ అధ్యక్షుడు

1,500లకు పైగా ప్రదర్శనలిచ్చాం