
సీలేరు నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
చింతూరు: సరదా గడుపుదామని సీలేరు నది వద్దకు వెళ్లిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు నదిలో మునిగి గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. చింతూరుకు చెందిన మనోజ్‌కుమార్, రవి, సిద్ధార్థ, వెంకన్నబాబు, దిలీప్‌కుమార్, శ్రీనులు సరదాగా గడిపేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని చింతూరు మండలం కల్లేరు వద్దనున్న సీలేరు నది వద్దకు వెళ్లారు. కాసేపు నదివద్ద గడిపిన అనంతరం వారిలో సుగ్రీవ శ్రీను స్నానం చేసేందుకు నదిలో దిగగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో అతనిని కాపాడేందుకు స్నేహితుడైన నాగుల దిలీప్‌కుమార్ కూడా నదిలో దిగాడు. లోతు అధికంగా ఉండడంతో అతను కూడా నీటిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వారి జాడకోసం గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. అప్పటికే చీకటి పడడంతో గాలింపు చర్యలు చేపట్టడం సాధ్యపడలేదు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్, ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సోమవారం ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని ఎస్‌ఐ రమేష్‌కు వారు సూచించారు.

సీలేరు నదిలో ఇద్దరు యువకుల గల్లంతు

సీలేరు నదిలో ఇద్దరు యువకుల గల్లంతు