ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేస్తే చర్యలు

Mar 23 2025 8:49 AM | Updated on Mar 23 2025 8:47 AM

జిల్లా పంచాయతీ అధికారి లవరాజు

పాడేరు రూరల్‌: నిబంధనలు అతిక్రమించి ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) లవరాజు హెచ్చరించారు. జిల్లా కేంద్రం పాడేరులో ట్రాఫిక్‌ సమస్య పెరగడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం ఆయన పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్‌పాత్‌లపై కూరగాయల వ్యాపారాలు చేస్తున్న వారందరూ రైతుబజార్‌లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే లా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారా లు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించవద్దన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement