● వాహనాన్ని వదిలేసి పరారైన నిందితులు
● సుమారు 280 కిలోల గంజాయి
స్వాధీనం
డుంబ్రిగుడ: మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ఓ కారు మండలంలోని అరకు సంతబయలు జాతీయ రహదారి నుంచి అరకులోయ వెళ్లే డైవర్షన్ రోడ్డు మలుపు వద్ద శనివారం బోల్తా పడింది. స్థానికుల సమాచా రంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పొక్లెయిన్‌తో కారును సరిచేసి, అందులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోక ముందే కారులో ప్రయాణిస్తున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన గంజాయి 280 కిలోలు ఉంటుందని స్థానిక పోలీసు స్టేషన్ రైటర్ ధర్మేంద్ర తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.