పాడేరు నుంచి కిముడుపల్లి మీదుగా బంగారుమామిడి వరకు పక్కా రహదారి సౌకర్యం ఉంది. దశాబ్దాల తరబడి అధ్వానంగా ఉన్న రహదారిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో కొత్తగా నిర్మించారు. దీంతో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తారని ఆశ పడ్డాం. నిరాశే ఎదురైంది. దీంతో బస్సు సౌకర్యం కల్పించాలని తొలుత ఆర్టీసీ అధికారులను విన్నవించాను. వారు పట్టించుకోకపోవడంతో సుమారు ఐదు సార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతులు అందజేశాను. కానీ అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికై న అధికారులు స్పందించి మా గ్రామలకు బస్సు సౌకర్యం కల్పించాలి.
– వంతల అప్పారావు, కిముడుపల్లి, గ్రామం, పెదబయలు మండలం