కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పుడు పట్టణాలు, గ్రామాలల్లో తెల్లవారేది. పొద్దున్నే లేచే సరికి ఇళ్ల ముందు పిచ్చుకలు చప్పుడు చేసుకుంటూ ఇంటా బయటా తిరిగేవి. ఇలా ఎక్కడ చూసినా కాకులు, పిచ్చుకల కిలకిలరావాలు ప్రకృతికి నిలయాలుగా నిలిచేవి. కానీ | - | Sakshi
Sakshi News home page

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పుడు పట్టణాలు, గ్రామాలల్లో తెల్లవారేది. పొద్దున్నే లేచే సరికి ఇళ్ల ముందు పిచ్చుకలు చప్పుడు చేసుకుంటూ ఇంటా బయటా తిరిగేవి. ఇలా ఎక్కడ చూసినా కాకులు, పిచ్చుకల కిలకిలరావాలు ప్రకృతికి నిలయాలుగా నిలిచేవి. కానీ

Mar 20 2025 1:15 AM | Updated on Mar 20 2025 1:13 AM

అనకాపల్లి టౌన్‌/రాజవొమ్మంగి :

కనాడు మనిషికి పిచ్చుక కూడా నేస్తమే. పిచ్చుకతో మనిషికి ఉన్న సంబంధం 10 వేల సంవత్సరాల నాటిది. మానవుడు వ్యవసాయం ప్రారంభించిన తొలి రోజులలో తమకు ఉపకరించే పశుపక్ష్యాదుల పట్ల శ్రద్ద వహించేవారు. ప్రధానంగా మన ఇంటి పిచ్చుకగా పిలువబడే ఈ పక్షి తాటాకు ఇళ్ల చూరుల్లో గూళ్ళు పెట్టుకొని తమ సంతతిని వృద్ది చేసుకొనేవి. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారంతా తమ ఇళ్ల చూరుకు ధాన్యం కుంకుల గుత్తులు వేలాడదీసేవారు. దీంతో పిచ్చుకలు ఆహారం తీసుకొని ఆ ఇంటి చుట్టుపక్కల కిచుకిచు మంటూ తిరుగుతుండేవి. పిచ్చుకలు పంటను ఆశించే క్రిమికీటకాలను తినడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. నేడు పొలాల్లో చల్లే రసాయిన క్రిమి సంహారక మందులు పిచ్చుకలను వాటి తిండికి దూరం చేశాయి.

పిచ్చుకల సంరక్షణకు గ్రీన్‌ క్లబ్‌ సభ్యుల కృషి

గ్రీన్‌క్లబ్‌ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. జంతు, వృక్ష ప్రేమికుడైన ఈయన పర్యావరణ పరిరక్షణలో ముందు ఉంటారు. గ్రీన్‌క్లబ్‌ అనే సంస్థ్ధను 2014 జూన్‌ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ప్రారంభించారు. చెట్లు పెంచాలని, పిచ్చుకలను రక్షించాలని గత 12 ఏళ్ల నుంచి పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. కొంత నిధులు వెచ్చించి, సమీకరించి ఈ ప్రకియకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వేసవి వచ్చిందంటే చాలు మట్టి పాత్రలకు బాటిళ్లను అమర్చి ఇంటి పరిసర ప్రాంతాలలోను, చెట్ల తొర్రలకు, వీటిని ఏర్పాటు చేస్తుంటారు. దేవాలయాల ఆవరణలో వరి కంకులను కడుతుంటారు. పక్షి జాతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ బాగుంటుందని, మన పిచ్చుకను మనమే రక్షించుకుందాం అంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

జీవ వైవిధ్యం కాపాడుకోవాలి..

కొన్ని పక్షి జాతులు అంతరించిపోతే జీవవైవిధ్యం సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మానవుడి ఆధునిక జీవన శైలి వల్ల, సౌండ్‌, ఎయిర్‌ పొల్యూషన్‌, సెల్‌టవర్స్‌ వల్ల పిచ్చుకలు కనుమరుగైపోయాయి. మానవ మనుగడకు పిచ్చుకల సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

–భవానీ, ప్రధాన శాస్త్రవేత్త, కీటక విభాగం, ఆర్‌ఏఆర్‌ఎస్‌ అనకాపల్లి

కనుమరుగవుతున్న పిచ్చుకలు

సడి లేని

గిజిగాడు...

చిన్ని పొట్టకు తిండి, గూడూ కరువే

పచ్చదనం లేక నీడ కరువై...

ఆధునికీకరణలో భాగంగా పచ్చని రావి, మర్రి చెట్లను నిర్ధాక్షణంగా తొలగించేశారు. పోనీ మానవుడు నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలలో కాస్తంత చోటు కూడా పక్షులకు లేకుండా పొయిది. వాటి గూడుకు కనీసం చెట్లు కూడా లేవు. చిన్ని పొట్టకు ఇంత తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. వాస్తవానికి పిచ్చుకలలో అనేక జాతులు ఉండేవి. పిచ్చుక జాతి అంతరించిపోవడానికి రేడియోధార్మికత విడుదల చేసే సెల్‌ టవర్లే ప్రధాన కారణంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల పిచ్చుకలలో సంతానోత్పత్తి సామర్ధ్యం దెబ్బతింటుంది. పిచ్చుకలు సాధారణంగా చెట్లు, పూరిపాకల పైకప్పు కింద గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి కనుమరుగు అయిపోవడంతో వీటి ఆవాసం కరువైంది.

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు1
1/7

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు2
2/7

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు3
3/7

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు4
4/7

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు5
5/7

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు6
6/7

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు7
7/7

కిచ్‌ కిచ్‌..కిచ్‌..కిచ్‌..కిచ్‌కిచ్‌ ఈ శబ్ధాలతో ఒకప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement